“హరిహర వీరమల్లు” ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్

“హరిహర వీరమల్లు” ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్

Published on Jan 1, 2025 7:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పవన్ నుంచి క్రేజీ పీరియాడిక్ సినిమాగా రాబోతుంది. అయితే గతకొన్ని రోజులు నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అని బజ్ వినిపించింది.

కానీ మేకర్స్ ఫైనల్ గా దీనిపై సాలిడ్ అప్డేట్ అందించారు. పవన్ ఆలపించిన ఈ పాటని ఈ జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు. దీనితో వీరమల్లు మ్యూజిక్ ఎట్టకేలకు స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు