టాక్..పవన్ ఫైనల్ గా సినిమాలపై ఎక్కువ దృష్టి.?

Published on Sep 22, 2022 7:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఇపుడు పవన్ ఉన్న పరిస్థితుల్లో అభిమానులు అయితే ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసెయ్యాలని కూడా చూస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి పవన్ సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ బిజీగా కనిపిస్తుండగా తాను ఓకే చేసిన సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి.

పైగా ఈ దసరా నుంచి ఓ పొలిటికల్ టూర్ కూడా వేయడంతో ఇక సినిమాల సంగతి ఏంటా అని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్ గా అయితే ఈ టూర్ ఆగగా పవన్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే పవన్ త్వరలోనే ముందు వీరమల్లు షూట్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన యాక్షన్ గ్లింప్స్ తో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :