ఫుల్ ఫ్లెడ్జ్ పాన్ ఇండియా భాషల్లో “పుష్ప 2”.. కానీ

ఫుల్ ఫ్లెడ్జ్ పాన్ ఇండియా భాషల్లో “పుష్ప 2”.. కానీ

Published on Jan 31, 2025 9:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు కొల్లగొట్టి అదరగొట్టింది. అయితే ఫైనల్ గా ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చేసిన ఈ సినిమా ఒక్క కన్నడ మినహా మిగతా పాన్ ఇండియా భాషల్లో నెట్ ఫ్లిక్స్ వారు నిన్న తీసుకొచ్చారు.

అయితే ఇపుడు ఈరోజు నుంచి కన్నడ వెర్షన్ లో కూడా పుష్ప 2 ట్రీట్ ఇచ్చేందుకు వచ్చేసింది. దీనితో ఫుల్ ఫ్లెడ్జ్ ఓటీటీ ఎంట్రీ ఈ సినిమా ఇచ్చింది కానీ.. పుష్ప 2 ని ఈ అన్ని భాషలు సహా ఇండియాలో బెంగాలీలో కూడా విడుదల చేసారు. థియేట్రికల్ గా తెలుగు నుంచి మొత్తం 6 భాషల్లో విడుదల అయ్యిన సినిమాగా పుష్ప 2 వచ్చింది కానీ ఈ వెర్షన్ ఓటీటీ రిలీజ్ మాత్రం కాలేదు. మరి ఇది కూడా ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు