బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా అలాగే మరో హీరోయిన్ కాజల్ హీరోయిన్స్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “సికందర్”. అయితే సల్మాన్ ఖాన్ నుంచి ఒక కంబ్యాక్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇదైనా తనకి కంబ్యాక్ లా నిలుస్తుంది అనుకుంటే ఈద్ నెల రిలీజ్ అని చెప్పి ఇంకా సినిమా రిలీజ్ డేట్ ని సస్పెన్స్ లోనే మేకర్స్ ఉంచారు.
మరి లేటెస్ట్ గా ఈ డేట్ ని అయితే మేకర్స్ రివీల్ చేశారు. దీనితో ఈ సినిమా ఈ మార్చ్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఇంకా సరైన బజ్ అయితే పెద్దగా కనిపించడం లేదనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఇపుడు వరకు వచ్చినా ప్రమోషనల్ కంటెంట్ మరీ ఎక్కువ బజ్ ని అందుకోలేదు. దీనితో రిలీజ్ లోపు ఏదొక పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప సికందర్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పాలి. మరి ఈ సినిమాతో అయినా సల్మాన్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.
See you in theatres worldwide on 30th March! #Sikandar #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru @ipritamofficial @Music_Santhosh… pic.twitter.com/IeiEAIUEiw— Salman Khan (@BeingSalmanKhan) March 19, 2025