“గేమ్ ఛేంజర్” మోడ్ లోకి వచ్చేసిన శంకర్.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలీ ఫీమేల్ లీడ్ లో ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికి తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా రిలీజ్ అండ్ అప్డేట్స్ కోసం అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శంకర్ మీదే భారం వేసిన మెగా అభిమానులు తాను ఈ సినిమాతో మళ్ళీ మాస్ కం బ్యాక్ కొట్టాలని ఆశిస్తున్నారు.

అయితే ఆ మధ్య అంతా ఇండియన్ 2, ఇతర పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఇప్పుడు ఫోకస్ పూర్తిగా గేమ్ ఛేంజర్ పై పెట్టారని చెప్పాలి. లేటెస్ట్ గా తన ఎక్స్ ఖాతా హెడర్ ఫోటోని మొన్న గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ పిక్ రామ్ చరణ్ తో అప్డేట్ చేసుకున్నారు. దీనితో ఇక శంకర్ ఫోకస్ అంతా గేమ్ ఛేంజర్ కి షిఫ్ట్ అయ్యింది అని వరుస అప్డేట్స్ ఉంటాయని చరణ్ అండ్ మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version