“గేమ్ ఛేంజర్” రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన శంకర్

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) అలాగే అంజలిలు హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా దర్శకుడు శంకర్ సినిమాని ఇప్పుడు దాదాపు పూర్తి చేయ వచ్చారు.

అయితే శంకర్ ఈ సినిమా కోసం చాలా సమయాన్నే తీసుకున్నారు. దీనితో రిలీజ్ పట్ల మరింత ఆసక్తి నెలకొనగా రిలీజ్ ఎపుడు అనేది శంకర్ గారి చేతుల్లోనే ఉందని దిల్ రాజు కూడా చెప్పేసారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఫైనల్ గా శంకర్ అప్డేట్ అందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ 2 ప్రమోషన్స్ లో గేమ్ ఛేంజర్ పై మాట్లాడారు.

సినిమా ఇంకా 10 రోజులు మాత్రమే బాలన్స్ ఉందని ఇది ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక పూర్తి చేస్తానని అలాగే ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ ని లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు బట్టి రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తామని వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసి సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తామని శంకర్ తెలిపారు. సో ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ కి ఇంకొంత కాలం సస్పెన్స్ తప్పదని చెప్పాలి.

Exit mobile version