ఫైనల్ గా ఆ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ – పూరి ల ‘లైగర్’

Published on Sep 22, 2022 1:15 am IST

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ తరువాత ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో కనిపించగా రోనిత్ రాయ్, ఆలీ, విషు రెడ్డి, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇతర పాత్రలు చేసారు.

ఇక ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, పవర్ఫుల్ లవ్ కం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నేటి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటిలో అందుబాటులోకి రాగా, త్వరలో హిందీ వర్షన్ కూడా రిలీజ్ కానుంది. మరి లైగర్ మూవీ థియేటర్స్ లో పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఓటిటి లో ఏ స్థాయి సక్సెస్ ని ఎంత రేంజ్ లో ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :