బలవంతంగా క్వారంటైన్‌కు సల్మాన్ సోదరులు

Published on Jan 5, 2021 10:12 pm IST

కరోనా కొత్త స్ట్రెయిన్ ఉధృతమవుతున్న నేపథ్యంలో బ్రిటన్, యూఏఈ, యూరోపియన్ దేశాల నుండి ఇండియాలోకి వస్తున్న ప్రయాణీకులను వారం రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను పలు రాష్ట్రాలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం కూడ ఈ నిబంధనను కఠినంగానే అమలుచేస్తోంది. ప్రయాణీకులు ఎవరైనా సరే క్వారంటైన్‌లోకి పంపుతోంది. అయితే ఇటీవల దుబాయ్ నుండి తిరిగొచ్చిన సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఈ నియమాన్ని పాటించలేదు.

విమానాశ్రయం నుండి క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఆయన కుమారుడు నిర్వాణ్ ఖాన్, మరొక సోదరుడు అర్భాజ్ ఖాన్ ముగ్గురూ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో బీఎసి వైద్యాధికారి వారి మీద పిర్యాదు చేయగా నగరంలోని ఖార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుచేసి నగరంలో క్వారంటైన్ కోసం కేటాయించిన ఒక హోటల్ కు ముగ్గురిని తరలించారు. గతంలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :