ఇంటర్వ్యూ: ద‌ర్శకుడు మను ఆనంద్ – ఎఫ్‌.ఐ.ఆర్‌. సినిమాకు ర‌వితేజ తోడు కావ‌డం పెద్ద ఎన‌ర్జీ

ఇంటర్వ్యూ: ద‌ర్శకుడు మను ఆనంద్ – ఎఫ్‌.ఐ.ఆర్‌. సినిమాకు ర‌వితేజ తోడు కావ‌డం పెద్ద ఎన‌ర్జీ

Published on Feb 8, 2022 10:00 PM IST

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ద‌ర్శ‌కుడు మను ఆనంద్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

 

ఎఫ్‌.ఐ.ఆర్‌. ఏ త‌ర‌హా సినిమా?

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్ర‌రిజంలో ఇరుక్కుంటాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది అనేది క‌థ‌.

 

మీకు ఇది మొదటి సినిమా కదా? విష్ణు విశాల్‌ను ఎలా ఒప్పించ‌గ‌లిగారు?

విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను. రాక్ష‌స‌న్ సినిమాలో ఆయ‌న న‌ట‌న గ‌మ‌నించా. నా క‌థ‌కు త‌గిన పాత్ర ఇత‌నే అని ఫిక్స్ అయ్యాను. ఇందులో ఆయ‌న కేరెక్ట‌ర్‌లో రెండు షేడ్స్ వుంటాయి. ముందు విష్ణుకు డ్రెగ్ నేప‌థ్యంలో ఓ క‌థ చెప్పాను. అది భారీ సినిమా అవుతుంద‌ని మ‌రో క‌థ చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఎఫ్‌.ఐ.ఆర్‌. చెప్పాను.

 

మీ జ‌ర్నీ, మీరు ఎదురుకున్న ఇబ్బందులు గురుంచి ఏమైనా చెబుతారా?

నేను గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌గ్గ‌ర 8 సంవ‌త్స‌రాలు ప‌నిచేశాను. స‌త్య‌దేవ్‌, అజిత్‌, ధ‌నుష్ (తూటా)కు ప‌నిచేశాను. ముందు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేర‌డ‌మే చాలా క‌ష్ట‌మైంది. నాకు ఎటువంటి ఇండ‌స్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను ఆస్ట్రేలియాలో మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ప‌నిచేశాను. నాకు సినిమాపై ఇంట్రెస్ట్‌తో 2011లో ఇండియా వ‌చ్చాను. చెన్నైలో దిగి నా ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టాను.

 

ఎఫ్‌.ఐ.ఆర్‌. వంటి సినిమా చేయ‌డం మీకు రిస్క్ అనిపించ‌లేదా?

రిస్క్ అనేది జీవితంలో ఓ భాగం. ఏ రంగంలోనైనా వుంటుంది. నేను కార్పొరేట్ జాబ్ వ‌దిలేస్తే ఫూలిష్ అన్నారు. ఆ త‌ర్వాత నేను కొన్ని అడ్డంకులు అదిగ‌మించాను. ఇకపోతే నేను ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఎటువంటి కాంట్ర‌వ‌ర్సీని ట‌చ్ చేయ‌లేదు. ఒక ముస్లిం బాయ్ ప్ర‌పంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది చూపించాను. ఇందులో ఏ మ‌తానికి సంబంధించిన సినిమా కాదు. యాక్ష‌న్, థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ రిలేష‌న్స్‌, డ్రామా కూడా ఉంది. డైలాగ్స్ కూడా ఎవ‌రినీ టార్గెట్ చేసిన‌ట్లు ఉండవు.

 

విష్ణు విశాల్‌తో జర్నీ ఎలా అనిపించింది?

త‌ను నిర్మాత‌గానే కాదు యాక్ట‌ర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్ న‌టుడు. నేను ఈ క‌థ చెప్ప‌గానే బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఆయ‌న ద‌ర్శ‌కుడు న‌టుడు. త‌ను ఛేజింగ్ సీన్స్‌లో ప‌రిగెత్త‌డం, రైల్వే ట్రాక్ ప‌క్క‌న క‌ష్ట‌ప‌డి మ‌రీ చేశాడు. ఆయ‌న‌లో డెడికేష‌న్ బాగా న‌చ్చింది. నిర్మాత‌గా కూడా ఆయ‌న ఫ‌ర్‌ఫెక్ట్‌.

 

ర‌వితేజ‌ గారు మీ సినిమాలో ఎలా భాగస్వామ్యం అయ్యారు?

ఈ సినిమాకు చాలా మంచి విష‌యాలు జ‌రిగాయి. కొత్త ఫేస్ల‌తో సినిమా చేయ‌డంతో తెలుగులో గ్రాండ్ లుక్ రావాల‌నుకున్నాం. విష్ణుకు నాని కూడా ఫ్రెండ్‌. అలాగే విష్ణు భార్య జ్వాలా గుప్త‌గారు ర‌వితేజ‌కు క్లోజ్ ఫ్రెండ్‌. అందుకే ఈ సినిమా పూర్త‌య్యాక ఆరు నెల‌ల క్రితం ట్రైల‌ర్ చూపించారు. అది చూడ‌గానే సినిమా చూస్తాన‌న్నారు. చూశాక చాలా బాగుంది. నేను ఈ సినిమాకు హెల్ప్ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చారు.

 

రవితేజ‌గారి సినిమా మీ సినిమా ఒకేరోజు విడుల‌వుతుంది? ఎలా అనిపిస్తుంది?

ర‌వితేజ ఖిలాడి మంచి అంచ‌నాల‌తో వస్తుంది. ఫ్యాన్స్ చూస్తారు. అలాగే ర‌వితేజ స‌మ‌ర్ప‌కులుగా ఉన్నార‌నే ఆస‌క్తితో మా సినిమానూ ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ కూడా చూస్తార‌నే న‌మ్మ‌కం ఉంది.

 

యాక్ష‌న్ సీన్స్, సంగీతం ఎలా ఉన్నాయి.

ఈ చిత్రానికి స్టంట్ శివ యాక్ష‌న్ చేశారు. గౌత‌మ్ సినిమాల‌కు ఆయ‌న‌ ప‌నిచేశారు. ఆ ప‌రిచ‌యంతో అడిగాను. నేను యాక్ష‌న్ సీన్స్ అనుకున్నాక ఆయ‌న డిజైన్ చేసి అద్భుతంగా వ‌చ్చేలా చేశారు. ఇక ఇందులో ఐదు పాట‌లున్నాయి. సాంగ్‌తోనే క‌థ ఆరంభ‌మ‌వుతుంది. మాస్ సాంగ్ కూడా వుంది. ఇక అశ్వ‌త్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ అని చెప్పాలి.

 

ఓటీటీలో ఆఫ‌ర్లు వ‌చ్చాయా?

పెద్ద సంస్థ‌లే ముందుకు వ‌చ్చాయి. కానీ వారు దీనిని థియేట‌ర్‌లో చూస్తేనే ఆ లుక్ వుంటుందని కూడా స‌ల‌హా ఇచ్చారు. విజువ‌ల్‌గా ఇది గ్రాండియ‌ర్ గా వుంటుంది. అందుకే థియ‌టేర్‌లో విడుద‌ల చేస్తున్నాం.

 

మీ సినిమాను ఎందుకు చూడాలంటే ఏమి చెబుతారు?

తెలుగు ఆడియ‌న్స్ సినిమా ప్రియులు. మంచి సినిమాలు ఆద‌రిస్తారు. కొత్త‌వారిని స‌పోర్ట్ చేస్తారు. బాహుబ‌లి, పుష్ప సినిమాల‌తో పాటు చాలా సినిమాలు ఆద‌రించారు. ఒక‌వేళ చూడ‌క‌పోతే ఎక్క‌డ క‌రెక్ష‌న్ అనేది తెలుసుకుంటాం.

 

మీకు న‌చ్చిన హీరో, ద‌ర్శ‌కులు ఎవ‌రు?

నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్‌ను. ఆయ‌న సినిమా త‌ప్ప‌కుండా చూస్తా. అలాగే మ‌హేష్‌బాబు సినిమాలు చూస్తా. పుష్ప సినిమా కూడా చెన్నైలో తెలుగు వ‌ర్ష‌న్ చూశా. కొర‌టాల శివ‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం చాలా అంశాలు దాగి వుంటాయి. అలాగే బాహుబ‌లి వంటి ఇంట‌ర్నేష‌న్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు కూడా ఇష్టం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు