రాఘవ లారెన్స్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!

రాఘవ లారెన్స్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!

Published on Oct 29, 2024 12:49 AM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ చేసే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఆయన నటించే సినిమాలకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లోని 25వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అక్టోబర్ 29న ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బిగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

ఇక ఈ సినిమాలో లారెన్స్ సరికొత్త గెటప్‌తో కనిపిస్తాడని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు