వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను నెల్లూరు టౌన్ హాళ్ళో కలెక్టర్ K.కార్తీక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ మరియు కొంతమంది ప్రముఖుల చేతుల మీదగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ.. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిందని.. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీజర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.
ఈ సినిమాలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.