‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ.. మోత మోగాల్సిందే!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో రజినీకాంత్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, ఈ చిత్ర ఔట్‌పుట్‌ని చూసి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని తన సోషల్ మీడియాలో తనదైన మార్క్ రివ్యూ ఇచ్చాడు.

అనిరుధ్ గతంలోనూ పలు సినిమాలకు రివ్యూ ఇవ్వగా, అవి విజయాన్ని అందుకున్నాయి. ఇక వేట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Exit mobile version