ఓజి: పవన్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్!?

ఓజి: పవన్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్!?

Published on Aug 31, 2024 3:02 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న డైరెక్ట్ మూవీ ఓజి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 2, పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం నుండి రిలీజైన గ్లింప్స్ సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి, ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారు మేకర్స్. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు