‘శ్రీ‌మ‌తి గారు’ అంటూ పాడుతున్న ల‌క్కీ భాస్క‌ర్

‘శ్రీ‌మ‌తి గారు’ అంటూ పాడుతున్న ల‌క్కీ భాస్క‌ర్

Published on Jun 17, 2024 6:24 PM IST

మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ల‌క్కీ భాస్క‌ర్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందా అని అంద‌రూ ఆతృత‌గా చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ పోస్ట‌ర్స్ అంచ‌నాల‌ను పెంచేశాయి.

కాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ను జూన్ 19న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అయితే, తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ”శ్రీ‌మ‌తి గారు” అంటూ సాగే ఈ సాంగ్ ను విశాల్ మిశ్రా, శ్వేతా మోహ‌న్ పాడారు. ఇక ఈ సాంగ్ కు శ్రీ‌మ‌ణి లిరిక్స్ అందించ‌గా, జివి.ప్ర‌కాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.

దుల్క‌ర్ సల్మాన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘ల‌క్కీ భాస్క‌ర్’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు