నాగార్జున ‘ది ఘోస్ట్’ నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున ‘ది ఘోస్ట్’ నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 14, 2022 6:49 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. గరుడ వేగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది.

మరోవైపు ది ఘోస్ట్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, తమహాగనే థీమ్ మ్యూజిక్ ఇలా అన్ని కూడా సూపర్ గా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి హైప్ ఏర్పరిచాయి. కాగా ఈ మూవీ నుండి వేగం అనే పల్లవితో సాగె ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు