ధనుష్ “నేనే వస్తున్నా” నుండి వీర శూర సాంగ్ రిలీజ్!

ధనుష్ “నేనే వస్తున్నా” నుండి వీర శూర సాంగ్ రిలీజ్!

Published on Sep 21, 2022 11:18 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన నేనే వస్తున్నా నుండి మొదటి సింగిల్ ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదలైంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన, ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 29, 2022 న థియేటర్లలో విడుదల కి సిద్ధంగా ఉంది. వీర శూర అనే టైటిల్ తో రూపొందిన ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరచగా, రాహుల్ నంబియార్ ఆలపించారు.

సినిమాలో ధనుష్ పాత్రలోని చీకటి కోణమే ట్రాక్. చంద్రబోస్ రాసిన సాహిత్యం పాటను మరింత ఆసక్తి గా చేసింది. ఒరిజినల్ వెర్షన్ నానే వరువేన్ కూడా అదే రోజు విడుదలవుతోంది. ఇందుజా రవి చంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌ పై కలైప్పులి ఎస్ థాను బ్యాంక్రోల్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు