మెగాస్టార్ “గాడ్ ఫాదర్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Sep 21, 2022 12:30 pm IST

మెగా అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ఈరోజు సాయంత్రం విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థార్ మార్ థక్కర్ మార్ అనే టైటిల్ తో రూపొందిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ లు కలిసి స్టెప్పులు వేయడం జరిగింది.

ఈ లిరికల్ వీడియోని ఈరోజు సాయంత్రం 04:05 గంటలకు యూ ట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పాట ఇప్పటికే అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో వినడానికి ఇప్పటికే అందుబాటులో ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో అక్టోబర్ 05, 2022 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :