‘నాయాల్ది’ అంటూ మాస్ స్టెప్పులతో వస్తున్న కళ్యాణ్ రామ్

‘నాయాల్ది’ అంటూ మాస్ స్టెప్పులతో వస్తున్న కళ్యాణ్ రామ్

Published on Mar 28, 2025 8:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నాడు. ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘నాయాల్ది’ అనే పాట రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాట పూర్తి మాస్ నెంబర్‌గా రానుందని.. ఇందులో కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేయని డ్యాన్స్ మనం చూడబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మార్చి 31న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ పాట ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు