ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఈ జాబితాలోనే ఈ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర కు చెందిన జానపద బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌరీ నాయుడు జమ్మి డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటి ఆనంది నటిస్తుండగా, ఇటీవల ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని ఈ సినిమాలో చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘నల జిలకర మొగ్గ’ అనే పాటను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, టి.జి.విశ్వ ప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నారు.