ఈ సారి IPL 2025 ఒక ఆసక్తికరమైన విధంగా మొదలైంది అని చెప్పాలి మొదటి 5 మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్న ప్రతి ఆటగాడు కూడా తమ కొత్త జట్టుకి మొదటి మ్యాచ్ ఆడినవారే కావడం విశేషం. ఇలా వచ్చిన ప్రతీ ఒక్క ఆటగాడు కూడా కొత్త టీంలలో భారీ రన్స్ కొడుతూ సాలిడ్ డెబ్యూ అందించి కీలక మ్యాచ్ లలో టర్నింగ్ పాయింట్స్ గా మారారు. అలా అదరగొట్టిన డెబ్యూ ఆటగాళ్లు ఎవరు? ఏ జట్లు నుంచి అనేది చూద్దాం.
1. కృణాల్ పాండ్య (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
తన మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ vs బెంగళూరు కాగా తాను 4 ఓవర్లు, 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. RCB తరఫున తొలిసారి ఆడిన కృణాల్, తన బౌలింగ్‌తో మధ్య ఓవర్లలో కీలకంగా నిలిచాడు. KKR రన్ రేట్‌ను తగ్గించి మ్యాచ్‌ను RCB కి సులభం చేశాడు.
2. ఇషాన్ కిషన్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
గతంలో ముంబై తరపున ఆడిన ఇషాన్ ఇపుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతున్నాడు. మొన్న రాజస్థాన్ రాయల్స్ తో మొదటి మ్యాచ్ లోనే కేవలం 47 బంతుల్లో 106 పరుగులు (నాటౌట్) గా నిలిచి దుమ్ము లేపాడు. కొత్త జట్టులో మొదటి మ్యాచ్‌లోనే శతకం బాది SRH కి భారీ స్కోరు తీసుకువచ్చాడు. ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ SRH వైపు మళ్లింది.
3. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్)
నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ముంబై ఇండియన్స్ తో పోటీగా మొదటి ఓవర్ నుంచే సత్తా చాటాడు. మొత్తం 4 ఓవర్లు, 18 పరుగులు, 4 కీలక వికెట్లు పడగొట్టి ముంబై బ్యాట్స్ మెన్ ల పరుగులు తగ్గించాడు ఈ యువ స్పిన్నర్.
4. అశుతోష్ శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)
అశుతోష్ డెబ్యూ ఒక సంచలనం అని చెప్పవచు. ఢిల్లీ తరపున ఆడిన ఈ యువ బ్యాట్స్ మెన్ తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఊహించని ఫినిషింగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అని చెప్పాలి. మొత్తం 31 బంతుల్లో 66 పరుగులు (నాటౌట్) గా నిలిచి లక్నో జట్టుపై విజయాన్ని తీసుకొచ్చి ఢిల్లీ చేతుల్లో పెట్టాడు.
5. శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్)
గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి ఈసారి పంజాబ్ కింగ్స్ లో డెబ్యూ అందించాడు. అయితే మొన్న జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 42 బంతుల్లో 97 పరుగులు (నాటౌట్) గా నిలిచి తన సెంచరీని కూడా లెక్క చేయకుండా జట్టు కోసం కట్టుబడి ఉన్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో గొప్పగా ఆడిన శ్రేయాస్, తన బ్యాటింగ్‌తో పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు. ప్రత్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇలా ఈ IPL సీజన్‌ను ప్రత్యేకంగా మార్చింది ఈ కొత్త ఆటగాళ్ల సూపర్ ప్రదర్శనలు. కొత్త జట్టులో మొదటి మ్యాచ్‌లోనే ఇంత పెద్దగా రాణించడం చాలా అరుదు. ఈ ట్రెండ్ కొనసాగుతుందా? లేదా మళ్లీ ఎవరైనా ఆశ్చర్యపరచతారా? అనేది చూడాలి.