గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రాల్లో చాలా వరకు మినిమమ్ గ్యారెంటీగా 40 కోట్ల షేర్ ని అందుకున్న సినిమాలు ఒక టైంలో కామన్ గా కొనసాగాయి. టాక్ తో సంబంధం లేకుండా చరణ్ ఈ ఫీట్ సెట్ చేయడంతో మిస్టర్ బాక్సాఫీస్ గా కూడా తాను పిలవబడ్డాడు.
అయితే “గోవిందుడు అందరి వాడేలే” తదితర సినిమాలు వస్తున్న సమయంలోనే దర్శకుడు శ్రీను వైట్లతో చేసిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “బ్రూస్ లీ” అయితే ఈ చిత్రం అప్పట్లో ప్లాప్ అనే టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
బ్రూస్ లీ కి ఎంత బడ్జెట్ అయ్యిందో అంతా కలెక్ట్ చేసేసింది అని ఆ సినిమా విషయంలో అందరూ హ్యాపీనే కానీ సినిమా ఇంకా అనుకున్న రేంజ్ కి రీచ్ అవ్వలేదు అని అది తప్ప బ్రూస్ లీ కి నష్టాలు రాలేదని తాను క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇన్ని రోజులు ఈ సినిమా ప్లాప్ అనుకున్న వారు కమర్షియల్ గా సినిమా హిట్టే అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
అయితే ఇదే తరహాలో చరణ్ బాబాయ్ “గుడుంబా శంకర్” కి కూడా అప్పట్లో అలానే జరిగింది. ఆ సినిమా ప్లాప్ కాదు బాగానే ఆడింది అని దర్శకుడు వీర శంకర్ రివీల్ చేశారు. సో బాబాయ్ కి గుడుంబా శంకర్ ఎలానో చరణ్ కి బ్రూస్ లీ నిలిచింది అని చెప్పాలి.