చిన్న చిత్రాలలో ఈ వారం విన్నర్ ఎవరో…?

చిన్న చిత్రాలలో ఈ వారం విన్నర్ ఎవరో…?

Published on Oct 18, 2019 9:22 AM IST

బడా హీరోలందరూ షూటింగ్స్ లో బిజీ ఉండగా చిన్న చిత్రాల హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో వారు వరుసగా చిత్రాలు విడుదల చేస్తున్నారు. గతవారం మరియు నేడు టాలీవుడ్ నుండి చాలా తక్కువబడ్జెట్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. స్టార్ హీరో మూవీల విడుదల సమయంలో వీరికి థియేటర్ల సమస్యతో పాటు, పోటీవలన ఆదరణ తక్కువగా ఉంటుంది, అందుకే మూవీని విడుదల చేయడానికి ధైర్యం చేయరు. కాగా నేడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి.

రాజుగారి గది3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కృష్ణారావ్ సూపర్ మార్కెట్, మళ్ళీ మళ్ళీ చూశా చిత్రాలు నేడు విడుదల అవుతున్నాయి. ఓంకార్ దర్వకత్వంలో రాజుగారి గది సీక్వెల్ గా వస్తున్న రాజుగారి గది 3 మూవీ హారర్ కామెడీగా తెరకెక్కింది. మరో మారు అశ్విన్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నటించడం విశేషం. గత రెండు చిత్రాలు హిట్ కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక యంగ్ హీరో ఆది చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా నేడు విడులవుతుంది. ఇటీవల జోడి చిత్రంతో పలకరించిన ఆది రెండు నెలల వ్యవధిలో ఈ చిత్రంతో ముందుకు వచ్చారు. విజయాల పరంగా వెనుకబడ్డ ఆది ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ హీరోగా పరిచయమవవుతూ తెరకెక్కిన హారర్ కామెడీ మూవీ కృష్ణారావ్ సూపర్ మార్కెట్, అలాగే మరో కొత్త హీరో నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మళ్ళీ మళ్ళీ చూశా చిత్రాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ నాలుగు చిన్న చిత్రాలలో విన్నర్ ఎవరవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు