‘స్పిరిట్’ రిలీజ్‌పై సరికొత్త బజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం మెజారిటీ శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక మరో సినిమా ‘ఫౌజీ’ని డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్.

దీంతో ‘స్పిరిట్’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో సరికొత్త బజ్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని 2027 ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2025 చివరినాటికి ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని.. ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్‌ను భారీ స్థాయిలో జరిపేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఈ లెక్కన 2027 లోనే ఈ సినిమా రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Exit mobile version