స్టైలిష్ యాక్షన్ కట్స్ తో బాలయ్య ?

స్టైలిష్ యాక్షన్ కట్స్ తో బాలయ్య ?

Published on Aug 26, 2024 5:32 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే నెలలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను కూడా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ కట్స్ తో బాలయ్య పై వచ్చే ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కర్ని థ్రిల్‌ చేస్తోందని.. పైగా ఊహకందని ట్విస్ట్ ను కూడా బాబీ కథకు అనుగుణంగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

మొత్తమ్మీద ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఏది ఏమైనా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు