‘వార్ 2’ ఘాట్ పై లేటెస్ట్ అప్ డేట్

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ‘వార్ 2’ సినిమా కూడా ఒకటి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా వచ్చే వారం హృతిక్ రోష‌న్‌ పై ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకోసం ముంబై శివార్లలో సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సాంగ్ ఘాట్ కూడా పూర్తి అయ్యాక, ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తారట.

దర్శకుడు అయాన్ ముఖర్జీ, కేవలం ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా ఈ సినిమాను డిజైన్ చేశారట. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version