‘దేవర’ కి డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్

‘దేవర’ కి డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్

Published on Aug 26, 2024 7:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ‘దేవర 1’ విడుదలకు ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే, టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ వచ్చే వారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడు. అన్నట్టు తన పాత్రకు ఇతర భాషల్లో కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పనున్నారు. డబ్బింగ్ అనంతరం సినిమా ప్రమోషన్స్ లో బిజీ అవుతాడట.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు