విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది. ఐతే, తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో వెంకటేష్ తన స్టెప్పులతో అలరించారు. సినిమాలోని ఓ సాంగ్‌కు హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వెంకటేష్ డాన్స్ వేయడం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి వెంకీ మామ ఎనర్జీ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ముక్కోణపు క్రైమ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి అందిస్తున్నారు.
Happy tears ❤️
Unlimited MASS energy ????????
Boss on Energetic mode
#VictoryVenkatesh ???? No one can beat himPongal Full Blockbuster Song -> Dec 30 th
Kodthunam mass blockbuster ???? @AnilRavipudi ????Tq
#SankranthikiVasthunam @VenkyMama pic.twitter.com/L4UcWy8oyu
— Saketh సంక్రాంతి కి వస్తున్నాం #Venky76 ???? (@VenkySaketh143) December 29, 2024