పవన్ సినిమాకు హిస్టరీ రిజల్ట్ రిపీట్ అవుతుందా?

పవన్ సినిమాకు హిస్టరీ రిజల్ట్ రిపీట్ అవుతుందా?

Published on Feb 26, 2021 7:03 AM IST

ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో బాగా హిట్ అయ్యినవి వేళ్ళ మీదనే చెప్పెయ్యొచ్చు. అయితే ఇపుడు కాదు కానీ ఒక దశాబ్దం కిందట అలా పవన్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన టేకింగ్ సెపరేట్ వాతావరణం కనిపిస్తుంది. ఇక అలాగే వాటిలో మంచి హిట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి జల్సా, తొలిప్రేమ, తమ్ముడు అలాగే ఖుషి సినిమాల పేర్లు వినిపిస్తాయి.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలతో పాటుగా మన టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు అద్భుతమైన ఆర్ట్ వర్క్ ను ఇచ్చిన ఆనంద్ సాయి పవన్ 28వ సినిమాకు ఫిక్స్ అయ్యారని లేటెస్ట్ గానే విన్నాము. అయితే ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా వింటేజ్ కళ్యాణ్ ను ప్రెజెంట్ చేస్తానని చెప్తూ వస్తున్నాడు.

ఇప్పుడు పవన్ వింటేజ్ సినిమాలకు పని చేసిన ఆనంద్ సాయినే భాగస్వామ్యం కావడం గమనార్హం. అయితే తాను పవన్ తో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపినవే..సో ఆ రకంగా మన సెంటిమెంట్స్ ప్రకారం హిస్టరీ రిజల్ట్ రిపీట్ అవుతుందా అన్నది చూడాలి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ సినిమాకు గాను దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు