తెలుగు హీరోయిన్ కి ఫుల్ డిమాండ్ !

Published on Oct 25, 2020 5:03 pm IST

తెలుగు అమ్మాయి ‘రీతూ వర్మ’ తెలుగులో కంటే.. తమిళంలో మలయాళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. నిజానికి తెలుగు అమ్మాయి కావడం వల్లే ఈమెకు ఛాన్స్ లు రాలేదు అనే రూమర్ ఉన్నా.. మొత్తానికి టాలీవడ్ నుండి కూడా తాజాగా మంచి సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతొంది రితూ వర్మ. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో టక్ జగదీష్ చేస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ నటించే తెలుగు, తమిళ సినిమాతో పాటు మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సరసన రీతూవర్మ నటిస్తోంది. ఈ క్రమంలో రవితేజ – రమేష్ వర్మ చేయబోతున్న సినిమాలో కూడా రీతూ వర్మ ఒక హీరోయిన్ గా నటిస్తోందట. అలాగే కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడితో చేయనున్న సినిమాలో కూడా రితూ వర్మ నటించబోతుందట.

మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో రితూ వర్మ బిజీ అయింది. అసలు రీతూ వర్మ షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలా సినిమా అవకాశాలను సాధించింది. మొదట్లో ‘ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తరువాత ‘పెళ్ళి చూపులు’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి పూర్తి స్థాయి హీరోయిన్ గా మారిపోయింది. ఏది ఏమైనా రీతూ వర్మకు తెలుగులో కూడా ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More