Sreeleela: శ్రీలీల డ్యాన్స్‌కి అవాక్కయిన నితిన్

Sreeleela: శ్రీలీల డ్యాన్స్‌కి అవాక్కయిన నితిన్

Published on Sep 24, 2024 11:58 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అయితే, ఈ షూటింగ్ మధ్యలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకోగా, దానిని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. అయితే, షూట్ మధ్యలో ఆమె తనకు నచ్చినవిధంగా ముసుగువేసుకుని, డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఇది చూసి నితిన్ అవాక్కయ్యాడు. అంతేగాక, ‘‘ఇది మహిళా లోకం భయ్యా.. చప్పట్లు కొట్టి అభినందించడం తప్ప ఏమీ చేయలేను’’ అంటూ కామెంట్ చేశాడు.

శ్రీలీల డ్యాన్స్ వేస్తున్నప్పుడు నితిన్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి. ‘రాబిన్‌హుడ్’ చిత్ర షూటింగ్ సమయంలో శ్రీలీల అల్లరికి నితిన్ ఇంకా ఎన్నిసార్లు అవాక్కయ్యాడో.. అని అభిమానులు అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు