స్వాగ్: మ‌గ‌వాడినే అనుస‌రించాలి అంటోన్న భ‌వ‌భూతి

స్వాగ్: మ‌గ‌వాడినే అనుస‌రించాలి అంటోన్న భ‌వ‌భూతి

Published on Jun 14, 2024 12:00 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుండీ, వెరైటీ అనౌన్స్ మెంట్స్ తో ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి మరోసారి ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా ‘స్వాగ్’ మూవీని తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ప్రీ-టీజ‌ర్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీవిష్ణు భ‌వ‌భూతి అనే పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. వృద్ధుడి గెట‌ప్ లో శ్రీ‌విష్ణు మేకోవ‌ర్ స్ట‌న్నింగ్ గా అనిపించింది. ఇక అత‌డు చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ‘వంశాలైనా, ఆస్తులైనా, ఆడ‌వాళ్లైనా మ‌గవాడినే అనుస‌రించాలి’ అంటూ శ్రీ‌విష్ణు చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంది.

కాగా, ఈ సినిమాలో శ్రీ‌విష్ణు రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో రీతూ వ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, మీరా జాస్మిన్ కీల‌క పాత్ర‌లో నటిస్తోంది. ద‌క్షిన నాగ‌ర్క‌ర్, శ‌ర‌ణ్య ప్ర‌దీప్, గెట‌ప్ శ్రీ‌ను, ర‌వి బాబు, గోప‌రాజు ర‌మ‌ణ తదితరులు ఇతర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు