‘రాధే శ్యామ్’లో ప్రభాస్ కి తమ్ముడు రోల్ ?

Published on Nov 23, 2020 9:14 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోకి తమ్ముడి రోల్ ఒకటి ఉందట. అయితే ఆ రోల్ లో జీవి ప్రకాష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే రోల్ లో తమిళ్ యంగ్ హీరో అథర్వా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు ఆ రోల్ లో జీవి ప్రకాష్ నటిస్తున్నాడట. కాగా ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.

మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైమ్ సేవ్ చెయ్యడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేసింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

More