టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా గామి చిత్రం తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు విశ్వక్. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. యూఎస్ ప్రాంతం లో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇది హయ్యెస్ట్ అని చెప్పాలి.
ఈ చిత్రం అక్కడ లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాదర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో చాందిని చౌదరి, అభినయ లు కీలక పాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ తదుపరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.