టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “గామి”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “గామి”

Published on Jul 14, 2024 9:01 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. గామి (Gaami) చిత్రంతో ఆడియెన్స్ కి కొత్త అనుభూతి అందించారు విశ్వక్. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. డిజిటల్ ప్రీమియర్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ ను అలరించింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఆదివారం జీ తెలుగు ఛానెల్ లో సాయంత్రం 6:00 గంటలకి ప్రసారం కానుంది. విద్యాదర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, అభినయలు కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. విశ్వక్ సేన్ చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు