కొత్త అనుభూతి ఇచ్చేలా “గామి” థ్రిల్లింగ్ టీజర్

కొత్త అనుభూతి ఇచ్చేలా “గామి” థ్రిల్లింగ్ టీజర్

Published on Feb 17, 2024 12:00 PM IST


టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “గామి” కూడా ఒకటి. దర్శకుడు విద్యాధర్ కగిట తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇపుడు విడుదలకి రెడీ అవుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన సినిమా గ్లింప్స్ అందరిలో ఆసక్తి రేపగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గ్లింప్స్ అయితే బయటకి వచ్చింది.

సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటీనటులు విశ్వక్ సేన్, అభినయ, చాందిని చౌదరి, శాంతి రావు తదితరులని చూపిస్తూ వచ్చిన ఈ టీజర్ లో కొన్ని విజువల్స్ అయితే థ్రిల్లింగ్ గా మూవీ లవర్స్ కి మన తెలుగు సినిమా నుంచి ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అనిపిస్తుంది.

ఇక రెండు మూడు ఫ్రేమ్స్ అయితే మరింత ఆసక్తిని రేకెత్తించాయి. వీటితో పాటుగా ఈ విజువల్స్ కి తగ్గట్టుగా నరేష్ కుమారన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఎఫెక్టీవ్ గా అనిపించగా విశ్వనాథ్ రెడ్డి కెమెరా వర్క్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందని చెప్పాలి. మరి టీజర్ తో మరింత ఆసక్తి రేపిన ఈ చిత్రం ఈ ఈ మార్చ్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు