మరోసారి టాలీవుడ్ లో రీ రిలీజ్ లు ఊపందుకున్నాయి. లేటెస్ట్ గా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఇంద్ర” రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ చేసి మళ్ళీ అప్పటి సత్తా ఇపుడు కూడా చూపించింది.
ఇక ఈ సినిమా తర్వాత రాబోతున్న నెక్స్ట్ బిగ్ రీ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఇదే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “గబ్బర్ సింగ్” అని చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ఇపుడు పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా మరోసారి గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది.
అయితే ఈ సినిమాకి మాత్రం యూఎస్ మార్కెట్ లో భారీ వసూళ్లు నమోదు అవుతాయని ఇప్పుడు నుంచే చాలా మంది భావిస్తున్నారు. ఇంద్ర సినిమానే సుమారు 70 వేల డాలర్స్ మేర గ్రాస్ ని అందుకుంది. అలాంటిది గబ్బర్ సింగ్ సునాయాసంగా లక్ష డాలర్స్ మార్క్ నుంచి లెక్క మొదలు పెడుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అనుకున్నట్టుగానే గబ్బర్ సింగ్ లెక్క అక్కడ నుంచే మొదలవుతుందో లేదో ఈ సెప్టెంబర్ 2 వరకు ఆగి చూస్తే తెలుస్తుంది.