రిలీజ్ కి ముందే 4 కోట్లతో “గబ్బర్ సింగ్”

రిలీజ్ కి ముందే 4 కోట్లతో “గబ్బర్ సింగ్”

Published on Sep 1, 2024 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని బాగా అలరించింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ విడుదల కి రెడ్డి అవుతోంది ఈ చిత్రం. ఈ చిత్రం ప్రీ సేల్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ 4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం బాలీవుడ్ లో హిట్ మూవీ అయిన డబంగ్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం రీ-రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు