చరణ్ పై క్లాస్ లుక్ తో మాస్ పోస్టర్ “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ అప్డేట్.!

చరణ్ పై క్లాస్ లుక్ తో మాస్ పోస్టర్ “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ అప్డేట్.!

Published on Sep 7, 2024 3:45 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే అది మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న సెన్సేషనల్ చిత్రం “గేమ్ ఛేంజర్” అనే చెప్పాలి. ఎప్పుడో మొదలైన ఈ చిత్రం రిలీజ్ పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే ఈ భారీ సినిమా నుంచి నేడు వినాయక చవితి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఎట్టకేలకి ఈ అప్డేట్ కూడా వచ్చేసింది.

మేకర్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే అప్డేట్ ని అయితే అందించారు అని చెప్పాలి. చరణ్ పై ఊహించని లెవెల్ మాస్ పోస్టర్ తో ఈ సినిమా తాలుకా రెండో సాంగ్ ని ఈ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి ఈ పోస్టర్ లో చరణ్ డ్రెస్సింగ్ చూస్తే క్లాస్ గా కనిపిస్తున్నాడు కానీ తన తలకి ఎర్ర తువాలు, బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే ఇదేదో మాస్ సాంగ్ లా అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈసారి ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పాలి.

ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్స్ గా కియారా అద్వానీ అలాగే అంజలిలు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు