గెట్ రెడీ.. “గేమ్ ఛేంజర్” ధోప్ ట్రీట్ వచ్చేస్తుంది!

గెట్ రెడీ.. “గేమ్ ఛేంజర్” ధోప్ ట్రీట్ వచ్చేస్తుంది!

Published on Dec 18, 2024 8:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో ఉన్న హైలైట్ అంశాల్లో శంకర్ మార్క్ క్రేజీ సాంగ్స్ కూడా ఒకటి.

మరి ఇపుడు వరకు వచ్చిన మూడు సాంగ్స్ కూడా మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే వీటికి మించిన సాంగ్ ఇంకొకటి సినిమాలో ఉంది. అదే వరల్డ్ అంతా మాట్లాడుకుంటుంది అని మేకర్స్ చెప్తున్నా సాంగ్ ‘ధోప్’. సంగీత దర్శకుడు థమన్ ఎప్పుడు నుంచో మంచి హైప్ ఇస్తున్న సాంగ్ ఇది కాగా ఫ్యాన్స్ లో ఈ సాంగ్ పట్ల సెపరేట్ హైప్ ఉంది.

మరి ఈ అవైటెడ్ సాంగ్ తాలూకా ప్రోమోని ఇపుడు మేకర్స్ రిలీజ్ చేసేందుకు లాక్ చేసేసారు. నేడు నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు కానుకగా అయితే ఈ క్రేజీ ట్రీట్ ని మేకర్స్ లాక్ చేసేసారు బహుశా నేడు సాయంత్రం ఈ ప్రోమో రావచ్చని తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ అండ్ హైప్ ఇస్తున్న సాంగ్ తాలూకా ప్రోమో ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు