యూఎస్ లో ఊపందుకున్న “గేమ్ ఛేంజర్” బుకింగ్స్..

యూఎస్ లో ఊపందుకున్న “గేమ్ ఛేంజర్” బుకింగ్స్..

Published on Dec 19, 2024 12:09 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే ఈ చిత్రం బుకింగ్స్ యూఎస్ మార్కెట్ లో ఓపెన్ అయ్యాయి.

అయితే ఇక్కడ మొదట్లో కొంచెం స్లో స్టార్ట్ నే అందుకున్న ఈ చిత్రం తదుపరి కొన్ని ముఖ్య ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యేసరికి సాలిడ్ స్టార్ట్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇంకా చాలా సమయం ఉండగానే “గేమ్ ఛేంజర్” సాలిడ్ జంప్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో లక్ష డాలర్స్ మార్క్ గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో గేమ్ ఛేంజర్ ఊపందుకున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు