సెన్సార్ పూర్తి చేసుకున్న “గేమ్ ఛేంజర్”.. 10 కి సిద్ధం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి కూడా మరో హీరోయిన్ గా మావెరిక్ శంకర్ మళ్ళీ తన కం బ్యాక్ కన్ఫర్మ్ అనే రేంజ్ లో వినిపిస్తున్న చిత్రమే “గేమ్ ఛేంజర్”. ఎన్నో అంచనాలు నడుమ వస్తున్నా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ బ్రహ్మాండంగా నిన్ననే అయ్యింది. ఇక నెక్స్ట్ రిలీజ్ కోసమే సిద్ధంగా ఉండగా ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేటెస్ట్ గా సెన్సార్ ని పూర్తి చేసేసుకుంది.

కొన్ని రోజులు కితమే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా మేకర్స్ కూడా సినిమా సెన్సార్ పూర్తయ్యినట్టుగా ఓ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. సో ఫైనల్ గా ఈ జనవరి 10కి థియేటర్స్ లో బ్లాస్ట్ చేసేందుకు “గేమ్ ఛేంజర్” సిద్ధం అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version