‘గేమ్ ఛేంజర్’ : అప్ డేట్ ఇవ్వాలంటూ నెగటివ్ ట్రెండ్ చేస్తున్న చరణ్ ఫ్యాన్స్

‘గేమ్ ఛేంజర్’ : అప్ డేట్ ఇవ్వాలంటూ నెగటివ్ ట్రెండ్ చేస్తున్న చరణ్ ఫ్యాన్స్

Published on Jan 31, 2024 3:01 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఫస్ట్ సాంగ్ జరగండి వాస్తవానికి గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సింది. అయితే కొన్ని కారణాల వలన దానిని వాయిదా వేశారు మేకర్స్.

విషయం ఏమిటంటే, ఈ సినిమా మొదలై దాదాపుగా ఏడాదిన్నరకు పైగా సమయం గడుస్తున్నప్పటికీ గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు మేకర్స్ కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్ డేట్ ఇవ్వలేదని, ఇకనైనా మూవీకి సంబంధించి మేకర్స్ అప్ డేట్ అందివ్వాలని కోరుతూ చరణ్ ఫ్యాన్స్ నేడు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. కావున గేమ్ ఛేంజర్ టీమ్ తమ బాధని అర్ధం చేసుకుని ఇకనైనా స్పందించాలని పలువురు చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు