సెన్సార్ పనులు ముగించుకున్న ‘గేమ్ ఛేంజర్’

సెన్సార్ పనులు ముగించుకున్న ‘గేమ్ ఛేంజర్’

Published on Dec 31, 2024 11:00 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

కాగా, ఈ సినిమా రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు గా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు