డల్లాస్ లో బ్లాక్ బస్టర్ అయ్యిన “గేమ్ ఛేంజర్” ఈవెంట్.. హైలైట్స్ ఇవే

డల్లాస్ లో బ్లాక్ బస్టర్ అయ్యిన “గేమ్ ఛేంజర్” ఈవెంట్.. హైలైట్స్ ఇవే

Published on Dec 22, 2024 11:02 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఇది కాగా భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది. మరి రిలీజ్ కి దగ్గరకి వస్తున్నా నేపథ్యంలో మేకర్స్ ఏ ఇండియన్ సినిమాకి చేయని విధంగా మొట్ట మొదటిగా యూఎస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయగా అక్కడ వేలాదిమంది ఆడియెన్స్ వచ్చి ఈ ఈవెంట్ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మరి ఈ ఈవెంట్ లో సినిమాలో వర్క్ చేసిన ప్రధాన నటీనటులు సహా ముఖ్య అతిధిగా దర్శకుడు సుకుమార్ అలాగే రామ్ చరణ్ నెక్స్ట్ మరో దర్శకుడు బుచ్చిబాబు సానా తదితరులు కూడా హాజరయ్యారు. మరి ఈ ఈవెంట్ హైలైట్స్ ఏంటో చూద్దాం..

అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ..”డల్లాస్ అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు, “ఇక్కడి అభిమానుల ప్రేమను చూసినప్పుడు మనం ఇండియాను వదిలి వెళ్లినట్లు అనిపించదు. అందుకే డల్లాస్‌ను ఎప్పుడూ ‘డల్లాస్ పురం’ అని పిలుస్తుంటారు. దర్శకుడు శంకర్ గారితో వర్క్ చెయ్యడం నా కల. తెలుగు సినిమా కోసం ఆయనను డైరెక్ట్ చేయమని అడగాలనుకున్నా, కానీ అలాంటి ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని ఊహించలేదు. ఈ మూడు సంవత్సరాలు నాకు ఎంతో నేర్పాయి. శంకర్ గారు ఇండియన్ సినిమాకు శంకర్ సచిన్ టెండూల్కర్ లాంటివారు. ఆయన నంబర్ వన్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్. ఇది నా ఐదేళ్లలో వచ్చిన మొదటి సొలో సినిమా. ఇది నాకు చాలా ప్రత్యేకం. దిల్ రాజు గారి స్టైల్‌లో చెప్పాలంటే, ‘మీకు ఎన్ని వెనుమో అన్నీ ఇరుక్కి.’ దిల్ రాజు గారితో పనిచేయడం ఆనందం,” అన్నారు.

ఇక ఈ ఈవెంట్ కి వచ్చిన ముఖ్య అతిధి లేటెస్ట్ గా పుష్ప 2 తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. “దిల్ రాజు గారు నాకు జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని వ్యక్తి ఆర్య తో మా ప్రయాణం మొదలైంది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తొలి నిర్మాతలలో ఆయన ఒకరు. రామ్ చరణ్ నా సోదరుడు లాంటి వ్యక్తి. ఆయనతో పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. రంగస్థలం సినిమాకు ఆయన నేషనల్ అవార్డ్ గెలుస్తారని అనుకున్నా, ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత అది ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నాను” అని సుకుమార్ తెలిపారు.

ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “నా 50వ చిత్రాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిర్మించడం ఆనందంగా ఉంది. శంకర్ గారి మొదటి తెలుగు సినిమా నిర్మించడానికి అవకాశం దొరకడం నా అదృష్టం. ఈ ప్రయాణం కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. కానీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తుంది” అన్నారు.

అలాగే దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ నా స్టైల్‌ను ప్రత్యేకమైన కథలతో కంబైన్ చేసి చేయాలనుకున్నాను. దానికి ఫలితమే గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ గారితో నా తొలి తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. ఇందులోని ‘అప్పన్న’ పాత్ర హైలైట్ అవుతుంది. ఇది వరకు చాలా మంది తెలుగు హీరోస్ లో పని చెయ్యాలి అనుకున్నాను కానీ నా మొదటి సినిమా రామ్ చరణ్ తోనే చెయ్యాలని ఉందేమో అందుకే గేమ్ ఛేంజర్ తో వస్తున్నాను” అంటూ తెలిపారు.

ఇక మ్యూజిక్ సెన్సేషన్ సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “గేమ్ ఛేంజర్ చిత్రంతో పనిచేయడం నా కెరీర్‌లో గొప్ప అనుభవం. రామ్ చరణ్ గారితో పనిచేయడం ఒక గౌరవం,” అని తెలిపాడు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ లో నేను చేసిన రోల్ నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా అది గేమ్ ఛేంజర్ కి ముందు గేమ్ ఛేంజర్ తర్వాత అన్నట్టు ఉంటుంది. చరణ్ గారిలో కొత్త డైమెన్షన్ ని మీరంతా చూస్తారు. తన అప్పన్న పాత్రని ఎంతో ప్రేమిస్తారు. నాకు దిల్ రాజు గారి బ్యానర్ ఇల్లు లాంటిది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వకీల్ సాబ్ సినిమాలు చేశాను, రెండు ప్రత్యేకమే. ఇపుడు గేమ్ ఛేంజర్ తో వస్తున్నాను” అంటూ అంజలి తెలిపింది.

అలాగే వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. “మూడు భాషల్లో కూడా నా గొంతు లోనే నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. రామ్ చరణ్ పేరుని నేను నా ఫోన్ లో ఆర్ సి ది కింగ్ అంటూ సేవ్ చేసుకున్నాను. చరణ్ చాలా జెన్యూన్ మనిషి తాను నిజమైన కింగ్. గేమ్ ఛేంజర్ తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది” అని ముగించారు.

ఇలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని ఒక హిస్టారిక్ ఈవెంట్ గా యూఎస్ గడ్డపై రాజేష్ కళ్లపల్లి అత్యంత ఘనంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు. అలాగే చాలా మంది ఆడిటోరియం బయట ఉండిపోయారు అని కూడా తాను తెలిపారు. మొత్తానికి అక్కడ మాత్రం గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు