“గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ షురూ..!

“గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ షురూ..!

Published on Jan 8, 2025 1:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాపై మంచి హైప్ నెలకొనగా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాస్ట్ ని మొదటగా ఈ సినిమానే స్టార్ట్ చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా బుకింగ్స్ ని ఒకో భాషలో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా కన్నడ వెర్షన్ లో బుకింగ్స్ ని స్టార్ట్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఆల్రెడీ బెంగళూరు కొన్ని ప్రాంతాల్లో ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కర్ణాటకలో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు