అఫీషియల్: సంక్రాంతి బరిలో దిగుతున్న ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండంతో ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు.

కానీ, దసరా పండుగ సందర్భంగా ఈ చిత్ర అఫీషియల్ రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాబోతున్నట్లు వారు తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version