‘గేమ్ ఛేంజర్’ మేకింగ్ వీడియో.. శంకర్ రియాక్షన్ పీక్స్!

‘గేమ్ ఛేంజర్’ మేకింగ్ వీడియో.. శంకర్ రియాక్షన్ పీక్స్!

Published on Jan 8, 2025 10:09 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో ‘గేమ్ ఛేంజర్’ గ్రాండియర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ మొదలుకొని ఎంతమంది హార్డ్ వర్క్ చేశారో మనకు చూపెట్టారు. రామ్ చరణ్ వైవిధ్యమైన లుక్స్‌తో ఈ మేకింగ్ వీడియో కనిపించాడు. ఇక శంకర్ ఈ సినిమా కోసం ఎంత తీవ్రంగా కష్టపడ్డారో కూడా మనకు ఇందులో కనిపిస్తుంది.

ఇక ఈ మేకింగ్ వీడియో చివర్లో శంకర్ ఇచ్చిన రియాక్షన్ ఈ వీడియోకే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు