47 మిలియన్ వ్యూస్‌తో ‘నా నా హైరానా’ హవా!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాలతో ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10న గ్రాండ్ రలీజ్‌కు రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటి వ‌ర‌కు మూడు సాంగ్స్‌, టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వీటితో గేమ్ ఛేంజ‌ర్‌పై ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా మూడో సాంగ్‌గా ‘నా నా హైరానా..’ను మేక‌ర్స్ రీసెంట్‌గా విడుద‌ల చేశారు.

ఈ పాట మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. థమన్ అందించిన మెలోడీ ట్యూన్స్ పాటకు ప్రాణం పోశాయి. ఇక ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ పాట సోష‌ల్ మీడియాలో 47 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టం విశేషం. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా ఉందని అభిమానులు అంటున్నారు.

ఇక ఈ సాంగ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు రెండు కళ్లు సరిపోవని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version