‘గేమ్ ఛేంజర్’ నైజాం బుకింగ్స్ ఎప్పుడంటే..?

‘గేమ్ ఛేంజర్’ నైజాం బుకింగ్స్ ఎప్పుడంటే..?

Published on Jan 8, 2025 3:01 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించగా పూర్తి పొలిటికల్ డ్రామాగా ఇది రూపొందింది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, నైజాం ఏరియాలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ చిత్ర ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ నైజాం ప్రాంతంలో జనవరి 8, బుధవారం రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సినిమా నైజాం ప్రాంతంలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు