మెగా ఫ్యాన్స్‌కి పండుగ.. మెగా పవర్ ఈవెంట్‌కి డేట్, టైం ఫిక్స్

మెగా ఫ్యాన్స్‌కి పండుగ.. మెగా పవర్ ఈవెంట్‌కి డేట్, టైం ఫిక్స్

Published on Jan 2, 2025 11:08 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ‘మెగా పవర్ ఈవెంట్’గా జరగనున్న ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం నిజంగా విశేషమని చెప్పాలి. ఇక ఈ ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఏపీ రాజకీయాల్లో మెయిన్ పిల్లర్‌గా ఉన్న పవన్, ఈ సినిమా ఈవెంట్‌కు వస్తుండటంతో ఈ ఈవెంట్‌పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు